protest | విద్యార్థులపై ఉపాధ్యాయుల ఆధిపత్యం…

protest | విద్యార్థులపై ఉపాధ్యాయుల ఆధిపత్యం…

  • నిరసన వ్యక్తం చేసిన విద్యార్థినులు..
  • పోలీసులు సర్దిచెబుతున్న వైనం..
  • విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై నిరసన..

protest | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన గోస్పాడు ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులపై ఉపాధ్యాయులు ఆధిపత్యంతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఇవాళ‌ మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగింది.

protest

దీనిపై బాదిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల ఆవరణలోనే నిరసన గళం విప్పారు. విద్యార్థులపై అనవసరమైన విషయాలను అంటగడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చిన్న సమస్యను పెద్దవిగా చేసి త‌మ మీద పెత్తనం చెలాయిస్తున్నారన్నారు.

protest

అసభ్య పదజాలంతో మాట్లాడుతూ మిమ్మల్ని బూటు కాలుతో తంతామని హెచ్చరిస్తున్నట్లు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు ఏమి చేసినా… ఎవరికీ చెప్పుకున్నా.. నన్నేమీ చేయలేరు అంటున్న ఆ మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న‌ మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉన్నతమైన స్థానానికి తీర్చిదిద్దాల్సిన కొంతమంది మహిళా ఉపాధ్యాయులు ఈ విధంగా మాట్లాడడం విడ్డూరమ‌ని విద్యార్థులు, తల్లిదండ్రులు అన్నారు.

protest

త‌మకు ఈ ఇద్దరు ఉపాధ్యాయులు పిడి, ప్రిన్సిపాల్ త‌మకు వద్దు అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోవ‌డంతో పోలీసులు సర్దిచెప్పారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారులు వచ్చి త‌మ‌ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.

Leave a Reply