సర్పంచ్ సోమన్నకు రాజకీయ ప్రముఖుల ఘన నివాళులు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకంపాడు సర్పంచ్
మరిపెడ, ఆంధ్రప్రభ: మండలంలోని వెంకంపాడు గ్రామ సర్పంచ్ ఉప్పల సోమన్న రోడ్డు ప్రమాదంలో సోమవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సోమన్న మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు రవి నాయక్, సర్పంచులు సిరాజ్, బాదావత్ లైలా సైదులు, బానోతు బద్రు, తాజుద్దీన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అదేవిధంగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సోమన్న మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు.
