సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి
మండల ప్రత్యేక అధికారి ఐటీడీఏ డీడీజీ అశోక్
ఆ శాఖల పనితీరుపై సర్పంచుల నిలదీత
ఉట్నూర్, ఆంధ్రప్రభ: సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఉట్టూరు మండల ప్రత్యేక అధికారి ఐటీడీఏ డీడీజీ అశోక్ అన్నారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ, అటవీశాఖల ప్రస్తావన రాగా అటవీ అధికారులు పంచాయతీలోని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, చెరువు గూడ సర్పంచ్ భగవంతరావు అధికారులకు ప్రశ్నించారు. దీంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కల్పించుకొని పనులు జరిగేలా సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఇంద్ర క్రాంతి పథకం ద్వారా 10 గ్రామైక్య సంఘాలకు భవనాలు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి స్థల సేకరణ కోసం సర్పంచులు సహకరించాలని ఏపీఎం రామారావు కోరారు. వివిధ శాఖల అధికారులు వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించగా పలు సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. పనులు అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులు మండల స్థాయి సమావేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు. వచ్చే సమావేశానికి అటవీ శాఖ ఉన్నత అధికారి పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓమహమ్మద్ రాయిస్ ఉల్లా, డీఎల్పీఓ ప్రభాకర్, తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు, వీబీజీ రాంజీ ఏపీఓ రజినీకాంత్, ఉద్యానవన శాఖ అధికారి మహేందర్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ , వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
