ఫర్టిలైజర్ యాప్ తో పరేషన్

ఫర్టిలైజర్ యాప్ తో పరేషన్

ఇబ్బందులు పడుతున్న రైతులు
రైతులకు యాప్ పై అవగాహన లేకపోవడంతో ఆందోళన
అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు

కుంటాల,ఆంధ్రప్రభ : మొన్నటి వరకు రైతులకు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు చెప్పులు పాసు పుస్తకాలు సైతం వరుస పెట్టి పడి కాపులు కాశారు. ఇప్పుడు మొబైల్ యాప్ లో నమోదు చేసుకుంటేనే యూరియా వస్తుందని చెప్పడంతో రైతులు ఏం చేయాలో తోచక తికమక పడుతున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఏ రోజు బాగుపడదు అన్న కవి మాటలు నేడు నిజమవుతున్నాయి. తెలంగాణలో యూరియా ఇతర ఎరువుల పంపిణీలో పాదదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు పరేషాన్ గా మారింది.

సర్వర్ సమస్యలు అవగాహన లోపం స్మార్ట్ ఫోన్ లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. యాప్ సరిగా పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు మరికొందరికి ఈ యాప్ పై అవగాహన లేకపోవడంతో సహకార సంఘాల కేంద్రాలకు మండల కేంద్రంలోని డీలర్ షాపుల వద్దకు తిరుగుతున్నారు. కేవలం యాప్లో నమోదు చేసుకున్నవారికి వీరియా పంపిణీ చేస్తున్నామని చెప్పడంతో ఇదేం బాధ అయిపోయా అంటూ వేను తిరుగుతున్నారు.

యాప్ తో నమోదు చేసుకున్న వారు సైతం దూర ప్రాంతాల్లో యూరియా ఉన్నట్టు యాప్ లో చూపించడంతో కిలోమీటర్ల సైతం లెక్కచేయకుండా రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసుకోవాల్సి వస్తుంది సౌకర్యం ఉన్నచోటు బస్తాలు తీసుకుందామంటే నో స్టాక్ చూపించడం దగ్గర్లో తీసుకుందామంటే దూరం చూపించడం దూరంలో తీసుకుందామంటే దగ్గర చూపించడం రైతులు అయోమయం చెందుతున్నారు.

ఫర్టిలైజర్ యాప్ లో మొదట వెళ్లగానే మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి దీంతో నాలుగు అంకెల గల ఓటిపి నంబర్ వస్తుంది దానిలో రైతులకు సంబంధించినటువంటి భూమి వివరాలు పంట వివరాలు ఇంత యూరియా అవసరం వంటి వివరాలతో కూడిన పరిచయం ఏర్పడుతుంది అయితే మొబైల్ సెలక్షన్ చేసుకున్న తర్వాత సహకార సంఘాలు వివరాలు డీలర్ షాపు ఉందో కూడా చూపించాలి సహకార సంఘాలు పరిధిలో లేదా మండల స్థాయి పరిధిలో గ్రామాలను అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది లేకుంటే దూరప్రాంతాల నుంచి కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొంటుంది

యాప్ పై అవగాహన లేకపోవడంతో రైతుల ఆందోళన

మొబైల్ లోని ఫర్టిలైజర్ యాప్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో ఏ విధంగా ప్రాసెస్ లోకి ముందుకు వెళ్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో యూరియా బుకింగ్ ఎలా చేసుకోవాలనేది గ్రామస్థాయిలో అవగాహన లోని రైతులకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం యూరియా ఎప్పుడు వస్తుందని అడగడం యాప్లు ఎలా చేసుకోవాలి యూరియా నమోదు ఎలా చేయాలి అని అందరూ రైతులు పడుతున్న ఇబ్బందులు ఆంధ్రప్రభ కు కనిపించింది ఎరువులు సకాలంలో అందుబాటులో ఉన్నప్పటికీ అందకపోవడంతో దిగుబడి పై ప్రభావం పడుతుందన్న ఆందోళన రైతుల్లో విత్తమవుతుంది. పంటకు ఎరువులు అవసరం అయినా సమయంలో యాప్ పని చేయడం లేదు యాప్ లేకుండా ఎరువులు సంబంధిత డీలర్ సైతం యాప్ లో నమోదు చేసుకుంటేనే ఈ ఊరిలో ఇస్తామని అంటున్నారు. లేకపోతే ఇవ్వమని చెప్తున్నారు. రైతులకు శాపంగా మారింది అటు పలువు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని యాప్ లోని సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించాలి. ఆన్ లైన్ విధానంలో కూడా ఎరువులు పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వివిధ గ్రామాల్లో రైతులు యూరియా పై యాప్ తో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫర్టిలైజర్ యాప్ సమస్యను పరిష్కరించాలని రైతుల కోరుతున్నారు.

యాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

యూరియా యాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం యాప్ ద్వారా కొంత మంది రైతులకు తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సవర్ణ చేయాలి ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా తీసుకోవడం మూలంగా కొంతమంది రైతులకు తెలియకపోవడంతో యూరియా అందడం లేదు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యవసాయ శాఖ అధికారులు సైతం స్మార్ట్ ఫోన్ లేని రైతులకు నష్టమే వెంటనే దీన్ని సవరణ చేయాలి.

రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా చూస్తున్నాం

అన్ని గ్రామాల్లోని రైతులకు యూరియా యాప్ పై పూర్తిస్థాయిలో రైతులకు యాప్ ద్వారా అవగాహన కల్పించేల కృషి చేస్తున్నామని, రోజువారీగా అందుబాటులో యూరియా ఉన్నచోటికి వెళ్లి రైతులు తీసుకు వెళుతున్నారని.. దీని ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని యూరియా యాప్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సాంప్రదించాలని అదేవిధంగా గ్రామాల్లోని క్లస్టర్ లోని ఉన్నటువంటి గ్రామాల ఏఈఓ లకు సైతం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఆయన తెలిపారు.

Leave a Reply