పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
డ్రగ్స్, సైబర్ నేరాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి: ఎస్పీ శ్రీనివాసరావు
నిజాంపేట, ఆంధ్రప్రభ: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులకు సూచించారు.
మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం నిర్వహించాలని, డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సీఐలు సైదా నాయక్, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
