కావ్య మారన్–అనిరుధ్ పెళ్లికి ప్రధాని మోదీకి ఆహ్వానం!
కావ్య మారన్–అనిరుధ్ పెళ్లికి ప్రధాని మోదీకి ఆహ్వానం!
న్యూఢిల్లీలో ప్రధానిని కలిసిన సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుటుంబం
నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం.. 21న చెన్నైలో రిసెప్షన్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో కళానిధి మారన్ కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీలో కళానిధి మారన్ దంపతులతోపాటు అనిరుధ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవిచందర్ కూడా పాల్గొన్నారు.
గ్రీస్‌లో వివాహం.. చెన్నైలో రిసెప్షన్
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. నవంబర్ 11న గ్రీస్‌లో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం జరగనుంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు
ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా వివాహ ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తదితరులను ఆహ్వానించినట్లు పేర్కొంటున్నారు.
ఎవరీ కావ్య మారన్?
కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్రాంచైజీతో పాటు సన్ గ్రూప్ వ్యాపార కార్యకలాపాల నేపథ్యంలో గుర్తింపు పొందారు. అనిరుధ్ రవిచందర్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు సంపాదించారు. ఆయన సంగీతం తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఈ నేపథ్యంలో వీరి వివాహ వేడుకపై సినీ, క్రీడా, వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
