గుండెపోటుతో పూజారి మృతి..!

రాజుపాలెం, సెప్టెంబర్ 2, (ఆంధ్రప్రభ): గుండెపోటుతో అడిగొప్పల గ్రామంలోని అమ్మవారి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న దోమనబోయిన సైదులు (50) మృతిచెందిన సంఘటన మండలంలోని కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీ వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు తన మోటార్ సైకిల్ పై నరసరావుపేట వైపు వెళుతుండగా వీరమ్మ కాలనీ వద్దకి వచ్చేసరికి గుండెపోటు రావడంతో బైక్ మీద నుండి పడి చనిపోయాడని గతంలో హార్ట్ ప్రాబ్లం వల్ల మృతునికి స్టంట్ లు కూడా వేశారని ఒంటిమీద ఎలాంటి గాయాలు లేవని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.