మరో దాడి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సిందూర్
తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేశాం
సైనిక శిబిరాలు, సామాన్య జన నివాసాలపై దాడులు చేయలేదు
సీమాంతర ఉగ్రవాదం వల్ల 950 మంది మరణించారు
రెండువేల మందికి పైగా గాయపడ్డారు..
త్రివిధ దళాలు సంయుక్తంగా బోర్డర్ దాడి చేశాం
దాడిలో పాల్లొన్న సిబ్బంది, విమానాలు క్షేమంగా రిటన్
దాడి వివరాలను వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
న్యూ ఢిల్లీ – సీమంతర ఉగ్రవాదంలో 350 మంది భారతీయులు 600 సైనికులు మృతి చెందారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు..ఇక సామాన్య పౌరులు 800, 1400 మంది సైనికులు గాయపడ్డారని తెలిపారు.. ఇకపై ఇలాంటివి ఉండకుండా ఉండేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని చెప్పారు… ‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విక్రమ్ మిస్రీ తో ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు పాల్గొన్నారు..
పహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ఫోర్స్ బాధ్యత తీసుకుందన్నారు మిస్త్రీ. పాక్ ఉగ్ర సంస్థల కోసం టీఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు.. టీఆర్ఎఫ్ ద్వారా ఎల్ఈటీ దాడులను భారత్ లో కొనసాగిస్తోందని అన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడిన వారిని గుర్తించామని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలమైందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టి ఆర్ ఎఫ్ అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు వంటిదన్నవారు. ఉగ్రసంస్థల కోసమే టి ఆర్ ఎఫ్ పనిచేస్తోందన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని గుర్తించామని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టారు. భారత్‌పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరించాయన్నారు. ఉగ్రసంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పహల్గామ్ దాడిలో మరో కుట్ర కూడా ఉందని, కశ్మీర్‌తో పాటూ దేశంలో విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. భారత్ పై రానున్న రోజుల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని ఈ నేపథ్యంలోనే ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందని విక్రమ్ మిస్రీ అన్నారు.
ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రారంభమైంది. 1.30 నిమిషాలకు ముగిసిందని తెలిపారు. ఆ 25 నిమిషాల వ్యవధిలోనే తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆపరేషన్ లో పాక్ లోని టెర్రర్ ఇండక్షన్ లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేశామని తెలిపారు. అప్జల్ కసబ్ కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ దాడులు చేశామని సోఫియా ఖురేషి చెప్పారు.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మాట్లాడుతూ.. “పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశారు. పౌర, మౌలిక సదుపాయాలకు నష్టం జరగకుండా, పౌరుల ప్రాణాలను కోల్పోకుండా ఉండటానికి ఈ ప్రదేశాలను ఎంపిక చేశామని చెప్పారు.