ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్బాపూర్ రవి
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (పీఈటీ) అధ్యక్ష, కార్యదర్శులుగా అబ్బాపూర్ రవి, ఎస్. గంగాధర్ ఎన్నికయ్యారు. 2026–28 సంవత్సరాలకు గాను శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో వీరు విజయం సాధించారు.
జిల్లాలోని 132 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు గాను 129 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి అబ్బాపూర్ రవి, రాజ్‌కుమార్ పోటీ పడగా.. రవికి 68 ఓట్లు, రాజ్‌కుమార్‌కు 61 ఓట్లు లభించాయి. దీంతో అబ్బాపూర్ రవి ఏడు ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
కార్యదర్శి పదవికి ఎస్. గంగాధర్, మల్లేష్‌గౌడ్ పోటీ పడగా.. గంగాధర్‌కు 80 ఓట్లు, మల్లేష్‌గౌడ్‌కు 49 ఓట్లు లభించాయి. దీంతో ఎస్. గంగాధర్ 31 ఓట్ల ఆధిక్యంతో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తిగౌడ్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మాజీ టీఎస్‌పీఈటీఏ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి అధ్యక్షతన, కార్యదర్శి మల్లేష్‌గౌడ్, ట్రెజరర్ రాజేందర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నిక అనంతరం నూతన అధ్యక్షుడు అబ్బాపూర్ రవి, కార్యదర్శి ఎస్. గంగాధర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లాలో క్రీడలు, శారీరక విద్య అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, నిర్మల్ జిల్లా కార్యదర్శి భోజన్న, కామారెడ్డి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
