కనకదుర్గమ్మ సన్నిధిలో రాష్ట్రపతి

  • ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం
  • స్వాగతం పలికిన హోం మంత్రి అనిత, ఎంపీ చిన్ని, చైర్మన్ బొర్రా గాంధీ
  • కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి
  • వేద పండితుల ఆశీర్వచనం
  • లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసిన దేవాదాయ శాఖ అధికారులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనా నాయక్ అమ్మవారి లడ్డూ ప్రసాదంతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు. హోం మంత్రి అనిత రాష్ట్రపతికి ఆలయ విశేషాలు విశిష్టతను వివరించారు.