చెన్నూరు విద్యార్థినికి ప్రశంస

చెన్నూర్, ఆంధ్రప్రభ : బోర్డు ఆఫ్ ఇంటర్ మీడియట్ ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో కరీంనగర్ పట్టణంలోని రిసోనెన్స్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న చెన్నూరు పట్టణం పబ్బ వాడకు చెందిన విద్యార్థిని పబ్బ సంజన (సిరి ) ఎంపీసీ ద్వితీయ 1000 మార్కులకు 993 మార్కులు సాధించడంతో కళాశాల చేర్మెన్ డాక్టర్ డి. అంజిరెడ్డి ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందించారు. చెన్నూరు పట్టణం పబ్బ వాడకు చెందిన సంజన పదవ తరగతి వరకు చెన్నూరు లోని చిన్నమున్సి పబ్లిక్ స్కూల్ లో అభ్యసించింది. అత్యధిక మార్కులు సాధించిన సంజన ను తోటి విద్యార్థులు, కాలనివాసులు అభినందించారు.

Leave a Reply