Prabhas | ప్లాన్ మారిందా..?

Prabhas | ప్లాన్ మారిందా..?
Prabhas | ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ
రాజాసాబ్ తర్వాత ‘ఫౌజీ’తో ప్రేక్షకుల ముందుకు
న్యూ ఏజ్ దర్శకులతో పనిచేయాలని ప్రభాస్ నిర్ణయం
డైరెక్టర్ దింజిత్తో కథా చర్చలు
రాజ్ కుమార్ పెరియస్వామితో కూడా ప్రభాస్ మీటింగ్
స్పిరిట్, సలార్ 2, కల్కి 2 తర్వాతే కొత్త ప్రాజెక్టులు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే.. రెండు మూడు సినిమాలు వెయిటింగ్ లో ఉంటున్నాయి. రాజాసాబ్ తో నిరాశపరిచిన ప్రభాస్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడానికి రెడీ అవుతున్నాడు. అయితే.. ప్రభాస్ ఇద్దరు దర్శకులకు ఓకే చెప్పాడని.. సినిమాలను ఎంచుకునే విధానంలో ప్రభాస్ ప్లాన్ మారిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఏ ఇద్దరు దర్శకులకు ఓకే చెప్పాడు..? అసలు ప్రభాస్ ప్లాన్ ఏంటి..?
Prabhas | దసరాకి ఫౌజీ..

రాజాసాబ్ నిరాశపరచడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఫీలయ్యరు. ప్రభాస్ అయితే.. ఆలోచనలోపడ్డాడు. అభిమానులను ఎంటర్ టైన్ చేయాలి.. సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని తపిస్తున్నాడు. ఈ సంవత్సరం రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు ఫౌజీ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. దసరాకి విడుదల చేయనున్నారని టాక్.
Prabhas | న్యూ ఏజ్ డైరెక్టర్స్ తో ప్రభాస్..

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రభాస్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నాడట. న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఎవరంటే.. సహజంగా.. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలతో సినిమాలు తీసే డైరెక్టర్స్. ఈ తరహా సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎకో, కిష్కింధకాండం సినిమాలతో విమర్శకులను మెప్పించి బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టిన డైరెక్టర్ దింజిత్. ఈ డైరెక్టర్ ఇటీవల ప్రభాస్ ని కలిసాడు. దీని గురించి స్వయంగా డైరెక్టర్ దింజిత్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగాయని.. సినిమా సెట్ అయ్యిందని టాక్.
Prabhas | ప్రభాస్, రాజ్ కుమార్ పెరియస్వామి..

అలాగే ప్రభాస్ ని కలిసిన మరో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. ఈ డైరెక్టర్ అమరన్ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రభాస్, రాజ్ కుమార్ పెరియస్వామి.. ఈ ఇద్దరి మధ్య కూడా కథాచర్చలు జరిగాయని.. ఈ కాంబో మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరి దర్శకులతో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ప్రభాస్ కమర్షియల్ డైరెక్టర్స్ తోనే కాకుండా.. న్యూఏజ్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే.. ప్రభాస్ స్పిరిట్, సలార్ 2, కల్కి 2 కంప్లీట్ చేయాలి. అందుచేత.. ఈ ఇద్దరు దర్శకులకు ప్రభాస్ ఓకే చెప్పినా.. ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
