Prabhas | మారుతి మెప్పించాడా..?

Prabhas | మారుతి మెప్పించాడా..?

Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫస్ట్ టైమ్ హర్రర్ జోనర్ లో సినిమా చేశాడు. మారుతి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేశాడు. అదే.. రాజాసాబ్. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించింది. ఇప్పుడు రాజాసాబ్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి.. రాజాసాబ్ కు (Raja Saab) వచ్చిన రియల్ టాక్ ఏంటి..?

హర్రర్ సినిమాలు తెలుగు తెర పై చాలా వచ్చాయి. మళ్లీ హర్రర్ మూవీనే తీయాలంటే.. అది ఎలా ఉండాలి. చాలా అంటే చాలా కొత్తగా ఉండాలి. అందుకనే.. హిప్నాటిజమ్, మైండ్ గేమ్.. అంటూ కొత్తగా చాలా విషయాలు చూపించడానికి ప్రయత్నించాడట డైరెక్టర్ మారుతి. ఒక్క మాటలో చెప్పాలంటే.. చందమామ లాంటి కథతో తెరకెక్కించిన సినిమా (Movie) ఇది. ఓ స్వార్థపరుడు.. రాజకుమారి పై మనసుపడడంతో ఆమె ఆస్తిని అంతా దక్కించుకోవాలి అనుకుంటాడట. మాయలూ, మంత్రాలు నేర్చుకొంటాడట.. ఆ తర్వాత రాజకుమారితో పాటు సంపద అంతా తన అధీనంలోకి తెచ్చుకుంటాడట. ఆతర్వాత రాజాసాబ్ ఏం చేసాడనేదే కథ.

ఇలాంటి కథ ప్రభాస్ కు కొత్త.. ఐడియా బాగానే ఉంది కానీ.. తెరకెక్కించడంలోనే ఎగ్జిక్యూషన్ బాలేదేనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ (Prabhas) కోసం, పాటల కోసం, ఆడియన్స్ కోసం తెర పై చేసిన విన్యాసాలు ఆకట్టుకోకపోవగా.. బాగా బోర్ కొట్టించాయి అని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. ఇంట్ర‌వెల్ బాగానే డిజైన్ చేసినా ఆతర్వాత సెకండాఫ్‌ లో అరగంట వరకు మళ్లీ ఎలాంటి మెరుపులు లేవట. మారుతి సినిమా అంటే కామెడీ బాగుంటుంది.. ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. వీరిద్దరూ కలిస్తే కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే.. సినిమాలో అది మిస్ అయ్యిందని టాక్. మొత్తానికి రాజాసాబ్ అనుకున్నంతగా లేదనేది రియల్ టాక్. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

CLICK HERE TO READ యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్

CLICK HERE TO READ MORE

Leave a Reply