పోస్టాఫీసు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజలు పోస్టాఫీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్ నరహరి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నర్సింగ్ భట్ల పోస్ట్ ఆఫీస్ లో ఐపీఓ రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ డెవలప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ నరహరి మాట్లాడుతూ పోస్టాఫీస్ లో పలు స్కీంలు ఉన్నాయని భారతీయ తపాలా సంస్థ ప్రపంచంలో అతిపెద్ద విస్తృతమైన నమ్మకమైన నెట్ వర్క్ కలిగిన ప్రభుత్వ సంస్థ అన్నారు. పోస్టాఫీస్ ద్వారా ప్రజలు సురక్షితమైన పొదుపు పథకాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఖాతాలు , పార్సిల్ సేవల సదుపాయం పొందవచ్చన్నారు. సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా, జోవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన, యాక్సిడెంట్ తదితర పథకాలు సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జకీర, ఉప సర్పంచ్ అనసూర్య, గ్రామ పోస్ట్ మేన్ తాజుద్దీన్, ఓవర్సీల్ నరసింహ, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
