దేశంలో ఎక్కడా లేని విధంగా…
యూసఫ్ గూడా, (ఆంధ్రప్రభ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)కు మద్దతుగా గురువారం యూసుఫ్ గూడా డివిజన్ లోని శ్రీ కృష్ణనగర్ లో డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీరితో పాటు డోర్ టూ డోర్ ప్రచారంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, సునీతా రావు తదితరులు పాల్గొన్నారు.

డోర్ టూ డోర్ ప్రచారం(door-to-door campaign) లో భాగంగా మంత్రులు ఇంటింటికి వెళ్ళి ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్ లో దోశ వేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం అమలు చేస్తున్నాం అని తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, సున్నా వడ్డీ రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామనీ ఓట్లర్లకు మంత్రులు వివరించారు.

