Polycet | ఎపీ పాలిసెట్ కీ విడుదల

వెలగపూడి – ఎపీ పాలిసెట్ – 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ఈ కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు పంపాలని అధికారులు తెలిపారు. preexam.apsbtet@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.

పాలిసెట్ కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.హోం పేజీలోని నోటిఫికేషన్ కాలమ్ లో పాలిసెట్ ప్రిలిమినరీ కీ అని డిస్ ప్లే అవుతుంది.ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై నొక్కితే పాలిసెట్ 2025 ప్రిలిమినరీ కీ డిస్ ప్లే అవుతుంది.పీడీఎఫ్ లో సెట్ల(ఏ,బీ,సీ,డీ) వారీగా కీని పొందుపరిచారు.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కీ కాపీని పొందవచ్చు.

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్‌ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 10వ తేదీ తర్వాత రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఫలితాలతో పాటే ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. వీటే ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు

Leave a Reply