Polling | సర్వం సిద్ధం..

Polling | సర్వం సిద్ధం..

Polling | నిజాంపేట, ఆంధ్రప్రభ : రెండో విడత ఎన్నికల్లో భాగంగా శనివారం నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద పోలింగ్ సామాగ్రిని గ్రామాలకు తరలించడం జరిగిందని ఎన్నికల స్పెషల్ అధికారి విజయ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజాంపేట మండల వ్యాప్తంగా రెండవ విడత స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను రెండు గ్రామాలు ఏకగ్రీవం కాగా, 14 గ్రామపంచాయతీలో ఎలక్షన్ లు జరుగుతున్నాయన్నారు

ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రితో గ్రామ పంచాయతీలకు చేరుకోవడం జరిగిందని, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అధికారులు చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. అలాగే ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో త‌హ‌సీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంఈఓ యాదగిరి, ఎంపీఓ నరసింహారెడ్డి, కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Polling

Leave a Reply