Polling station | క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప‌రిశీల‌న‌…

Polling station | క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప‌రిశీల‌న‌…

Polling station | అచ్చంపేట, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ గ్రామపంచాయతీ బొమ్మనపల్లి పోలింగ్ స్టేషన్‌(Polling station)ను జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మంగళవారం సందర్శించారు.

అచ్చంపేట సబ్‌డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచనలు, సలహాలు ఇచ్చారు.

ప్రతి ఓటర్‌కు పూర్తి భద్రత కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. పోలింగ్ రోజున పూర్తి అప్రమత్తతతో పటిష్ట భద్రతా చర్యలు అమలు చేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

Leave a Reply