Polling centers | పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన…

Polling centers | పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన…

Polling centers | మేడ్చల్, ఆంధ్రప్రభ : ఎల్లంపేట మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను మంగళవారం రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ సమగ్రంగా పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. డబిల్‌పూర్‌లోని బైబిల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల కిట్లు, ఇతర అవసరమైన సామగ్రి పంపిణీ విధానాన్ని సమీక్షించారు.

పంపిణీ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవ్యవస్థలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. అనంతరం కౌంటింగ్ సెంటర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద తగిన పోలీస్ బందోబస్తు, కెమెరాల పర్యవేక్షణ, ప్రవేశ–నిష్క్రమణ నియంత్రణ వంటి అంశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీపీ రమేష్ సూచించారు. శాంతి భద్రతలు కాపాడటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

Polling centers |

అనంతరం డబిల్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో మాట్లాడి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి పురుషోత్తం, ఏసిపి శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, డి ఐ కిరణ్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply