మతసామరస్యాన్ని కాపాడి రాజ్యాంగాన్ని రక్షించాలి
- విభజన, విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : మతసామరస్యాన్ని కాపాడుకుంటూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో జ్యోతి, సీపీఐ సీనియర్ నాయకుడు మోతే లింగారెడ్డితో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మతసామరస్యం, రాజ్యాంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నేదునూరి జ్యోతి, మోతే లింగారెడ్డి మాట్లాడుతూ.. మతం ఆధారంగా సమాజంలో విభజన తీసుకువచ్చి లౌకికవాదం, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కేంద్ర పాలకులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, గౌరవానికి హామీ ఇచ్చే వ్యవస్థ నిర్మాణం కోసం ప్రజలు సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నేదునూరి రాజమౌళి, మండల కార్యదర్శి మెట్టు శ్యామ్‌సుందర్‌రెడ్డి, దొమ్మాటి ప్రవీణ్‌కుమార్, మాదాసి బాబు, ముజీగ పరుశురాములు, షేక్ బాబు, నాంపల్లి లక్ష్మయ్య, గోపరాజు కుమారస్వామి, ముజీగా అజయ్, కల్వచర్ల వెంకటేశ్వర్లు, దుస్స వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
