Poling | స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 84.17 శాతం పోలింగ్

Poling | స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 84.17 శాతం పోలింగ్

సాయంత్రం 5 గంటల వరకు 84.17 శాతం పోలింగ్
పోలీసుల ఓటర్ల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఈ నెల 13న ఓట్ల లెక్కింపు

Poling | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 18 వార్డుల్లో ఏర్పాటు చేసిన 36 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. మొత్తం 18,550 మంది ఓటర్లలో 15,670 మంది ఓటు వేయడంతో 84.17 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు అధికా రికంగా ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్లు 18,550 మంది ఉండగా, అందులో పురుషులు 8,913 మంది, మహిళలు 9,6 36 మంది, ఇతరులు 1మంది ఉన్నారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటల నుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 2,138 ఓట్లు పోలై 11.53 శాతం నమో దైంది. ఉదయం 11 గంటల వరకు 6,181 ఓట్లు పోలై 33.32 శాతం నమోదైంది. మధ్యాహ్నం 1గంటకు 10,458 ఓట్లు పోలై 56.38 శాతం నమోదైంది. మధ్యాహ్నం 3గంటల వరకు 13,752 ఓట్లు పోలై 74.13 శాతం నమోదైంది. చివరకు సాయంత్రం 5 గంటల సమయానికి మొత్తం 15,670 ఓట్లు పోలై 84.17 శాతం నమోదైంది.

ఈ నెల 13న ఓట్ల లెక్కింపు:

ఉదయం నుంచే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగు నీరు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్‌చైర్లు, అవసరమైన వాహనాలు అందు బాటులో ఉంచారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఓటర్లు క్రమశిక్షణతో ఓటు వేశారు. అధికారులు, సిబ్బంది సమన్వ యంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. పోలింగ్ అనంతరం పోలీసులు భారీ బందోబస్తు మధ్య పోలింగ్ బాక్సులను పట్టణంలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. మొత్తం మీద స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్త మైంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply