రంగంలోకి దిగిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు

మణుగూరు, ఆంధ్రప్రభ : పట్టణంలోని తెలంగాణ భవనంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫర్నిచర్ ను బయటపడేసి కాల్చివేయడంతో రెండు పార్టీల మధ్య ర‌ణరంగం నెల‌కొంది. దీంతో మ‌ణుగురులో ఉత్కంఠ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ నాయకులు, మరోపక్క బీఆర్ఎస్ నాయకులు మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళన గురవుతున్నారు. పోలీస్ అధికారుల(Police officers) నుంచి కాంగ్రెస్ నాయకులకు భవనం ఖాళీ చేయాలని ఆదేశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఖాళీ చేసే ప్రసక్తే లేదని వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే బీఆర్ఎస్(Brs) జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Rega Kantha Rao) మరో రెండు మూడు గంటల్లో మణుగూరు కు చేరుకొనున్నారు. బీఆరస్ కార్యకర్తలు కూడా ప్రతి మండలం నుంచి భారీగా మణుగూరు తెలంగాణ భవన్ కు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కార్యాల‌యం వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో పోలీసులు చేరుకున్నారు.

Leave a Reply