పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వ వాహనం కరువు….

పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వ వాహనం కరువు….

అత్యవసర సమయాలలో ఇబ్బందులు పడుతున్న స్థానిక పోలీసులు…

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : స్థానిక పోలీస్ స్టేషన్ కు ప్రభుత్వ వాహనం లేకపోవడంతో అత్యవసర సమయంలో త్వరతగతిన సేవలు అందించే సమయాలలో స్థానిక పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా జాతీయ రహదారి కి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడంతో ఏదైనా ప్రమాదం జరిగితే మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది వెళ్లాలంటే ద్విచక్ర వాహనాలు వినియోగించాల్సి వస్తుంది .

గతంలో ఉన్న వాహనం మరమ్మతులకు గురి అవ్వడంతో గడిచిన ఐదు నెలలుగా ప్రభుత్వ వాహనం లేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది సిబ్బంది వెళ్లేందుకు ప్రభుత్వ జీబు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలను వాడాల్సి వస్తుంది దీని వలన స్థానిక పోలీసులకు అధిక భారం పడుతుంది. అలాగే గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉండటంతో ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ వెళ్తూ ఉంటుంటారు తరచూ ప్రమాదాలు జరగడంతో పాటు ఏదైనా గొడవలు జరిగితే సిబ్బంది వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలాగే మునేటి అవతల ఉన్న మామిడి తోటలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విడిది చేస్తూ ఉంటారు.

అలాంటి సమయాలలో కొందరు మద్యం సేవించి గొడవలు పడుతూ ఉంటారు వారిని ఎప్పటికప్పుడు నివారించేందుకు అధికారులు ఎక్కువసార్లు మామిడి తోటల వద్ద గస్తీ చేయాల్సి వస్తుంది దీనివలన పోలీస్ సిబ్బందిపై అధిక భారం పడుతుంది అంతేకాకుండా రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేసే సమయంలో స్థానిక పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు . ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వాహనాన్ని కేటాయించి స్థానిక పోలీసులకు ఆర్థిక భారాన్ని తగ్గించుటతో పాటు ప్రజలకు, భక్తులకు త్వరతగతిన సేవలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply