పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండలంలోని రామన్నగూడెం శివారు సబ్‌స్టేషన్‌ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బానోతు వెంకన్న తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ.5,410 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.