High Court | ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు…
High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మహిళా ఎమ్మెల్యేలను అవమానించారనే ఆరోపణలపై పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ వెలుపల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా పోలీసులు అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
అసెంబ్లీ బయట జరిగిన ఆందోళన సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఆమె చీర లాగారనే ఆరోపణలు పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు పరిశీలించింది. ఎమ్మెల్యేలు తమ విధుల్లో భాగంగా అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
