ఖమ్మం రూరల్, (ఆంధ్రప్రభ) : ఖమ్మం నగర పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (45) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రూరల్‌లోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం బాసిక్‌నగర్ తండాకు చెందిన బాలాజీ కొంతకాలంగా సింహాద్రి నగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలాజీ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన పిల్లలు తలుపు తెరచి లోపలికి వెళ్లగా… తమ తండ్రిని ఉరివేసుకుని ఉన్న స్థితిలో చూసి భయాందోళనకు గురై కేకలు వేశారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు తెలిపగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ ముష్కరాజు తెలిపారు.

