Police Case | ఇంద్రవెల్లి మార్కెట్ బంద్

Police Case | ఇంద్రవెల్లి మార్కెట్ బంద్

మారుతి పటేల్ ను బెదిరించిన వ్యక్తిపై కేసునమోదు

Police Case | ఇంద్ర‌వెల్లి, ఆంధ్రప్రభ : వార్డు మెంబర్ కాంబ్లె అతిష్ కుమార్ అనే వ్యక్తిపై స్థానిక పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం రాత్రి సదరు వ్యక్తి ఫోన్ లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాను నీవల్లే వార్డు మెంబర్ గా ఓడిపోయానంటూ.. డొంగ్రే మారుతి పటేల్ ను ఫోన్ లో బెదిరించాడు. దాంతో పాటు మండలంలో ఉన్న ఎల్టిఆర్ భూముల దుకాణాలను డ్రోజర్ పెట్టి కూలగొడుతానంటూ బెదిరించాడు.

Police Case

దీంతో స్థానిక నాయకులు మండల మార్కెట్ ను బంద్ ప్రకటించారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. సదరు వ్యక్తి పై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మారుతి డొంగ్రేను రెచ్చగొట్టే వాఖ్యలతో పాటు బెదిరింపులకు పాల్పడటంతో ఆతనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ మడవి ప్రసాద్, స్థానిక ఎస్సై ఈ సాయన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply