Polavaram-Left-Ccanal-Godavari : ఉత్త‌రాంధ్రాకు గోదారి అభిషేకం Andhra Prabha Top News

Polavaram-Left-Ccanal-Godavari : ఉత్త‌రాంధ్రాకు గోదారి అభిషేకం Andhra Prabha Top News

  • పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ప్రారంభం
  • ప్ర‌ణ‌మిల్లి సీఎం న‌మ‌స్కారం

(ఆంధ్ర‌ప్ర‌భ‌, విశాఖ‌ప‌ట్నం బ్యూరో)

ఉత్తరాంధ్ర గడపలో అడుగుపెట్టిన గోదారమ్మకు ప్రణమిల్లి నమస్కారం చేస్తున్నా. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురానికి నీళ్లిచ్చాం. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చింది. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్‌లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తాం . శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి…బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం : అని ఏపీ సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నుంచి ఉత్ర‌రాంధ్రాకు బుధ‌వారం నీటిని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంఆ పాయ‌కాపురం స‌భ‌లో్ ఆయ‌న మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుంది. 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతాయి విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తాం, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తాం . 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.3,200 కోట్ల వ్యయంతో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు.

ఇక అన‌కాప‌ల్లి కేరాఫ్ అభివృద్ధి

పెద్ద పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తుంటే గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందిఆసియా మొత్తాన్ని కనెక్టు చేసే సబ్ సీ కేబుల్ కనెక్టివిటీ ఇక్కడకు వస్తోంది. .హార్బర్లు, మూలపేట పోర్టులతో తూర్పు తీరాన్ని మధ్యభారత్ తో కనెక్టు చేస్తాం. ఆరు నెలల క్రితం అనకాపల్లిలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశాం . హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లా తరహాలోనే అనకాపల్లి అభివృద్ధికి అడ్రస్ లా మారుతుంది , ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు ఉత్తరాంధ్రకే వలసలు వస్తారు. ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్ర అవుతుంది. అని సీఎం స్ప‌ష్టం చేశారు.

అది సిగ్గులేని పార్టీ

రెండేళ్ల క్రితం గొడ్డలి పార్టీ చీకటి పాలన కారణంగా ఉత్తరాంధ్ర నిలువునా వణికి పోయింది. కబ్జాలతో 5 ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆ పార్టీ నేతలు పీడించారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేని పార్టీ.. రుషికొండలో విలాసవంత నివాసానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టాడు ఆ డబ్బులతో నాలుగైదు సాగు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. ప్రతిపక్షంలో ఉన్నా కుట్రలు చేస్తూ విషం గొడ్డలిపార్టీ కక్కుతోంది . మావిగన్ అంటారు, విశాఖకు డేటాసెంటర్లు వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటిఎం బ్యాచ్ లతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు
డేటా సెంటర్లు మొత్తానికి కావాల్సింది కేవలం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరం. కానీ పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకువచ్చే సామర్ధ్యం ఉంది . గ్రావిటీ ద్వారా నీరు వస్తే విశాఖకు నీటి ఎద్దడే ఉండదు. గొడ్డలి పార్టీ…రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తామే చేశామంటూ క్రెడిట్ చోరీ చేస్తోంది.భోగాపురం మేమే కట్టామని చెప్పుకున్నారు. నవ్వుల పాలయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే సొరంగాలు మేమే తవ్వాం అన్నారు. ప్రజలు చీ కొట్టారు… ఇప్పుడు అనకాపల్లికి నీళ్లు ఇచ్చాం… ఇది కూడా మేమే చేశామని చెప్పుకుంటారు. రేపు పోలవరం పూర్తి కాగానే అదీ మా గొప్పే అంటారు.ప్రజలు ఛీ కొడుతున్నా గొడ్డలి పార్టీ నేతలకు సిగ్గు రావటం లేదు. వాళ్ల ఫేక్ రాజకీయం అది. నేర చరిత్ర ఉన్న గొడ్డలి పార్టీది విధ్వంసమే అసలు నైజం . అభివృద్ధి శాశ్వతం కావాలంటే ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండాలి, అని సీఎం సీబీఎన్ సూచించారు.
.

పాల‌కులం కాదు.. సేవ‌కులం

రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో ప్రతి రోజూ అడుగులు వేస్తున్నాం.ప్రధాని మోదీ సహకారంతో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాం. రైల్వే జోన్ సాధించాం. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే 5 ఏళ్ల క్రితమే ఈ ఫలాలు అన్నీ దక్కేవి. అందుకే అభివృద్ధి శాశ్వతం అవ్వాలంటే….ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలి. మేం పాలకులం కాదు…సేవకులం అని ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాను చంద్రబాబు అనే నేను సీఎంగా ఉన్న ప్రతీ సారీ నీటి భద్రత కోసం ప్రాధాన్యత ఇస్తూనే వచ్చాను నీరు-మీరు, నీరు-చెట్టు, చెక్ డ్యామ్ లు, ఇంకుడు గుంతలు, పంటకుంటలు, డ్రిప్ ఇరిగేషన్, నీరు-ప్రగతి, జలధార లాంటి కార్యక్రమాల్ని చేపట్టాం. దేశంలోనే తొలిసారి సాగునీటి సంఘాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలనుకృష్ణాడెల్టాకు తీసుకెళ్లాను 2017లో ఆగస్టు 15 తేదీన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రారంభించాను. చంద్రబాబు అనే నేను 2026 సెప్టెంబరు 2 తేదీన గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకువచ్చాను వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రెండేళ్లలో సాగునీటి కోసం 25 వేల కోట్లు ఖర్చు చేశాం సీఎంగా నేను సంకల్పం చేసినట్టే అనే నేను అంటూ మీరు కూడా దేశం, రాష్ట్రాభివృద్ధి కోసం సంకల్పం చేయాలి 2047 స్వర్ణాంద్ర విజన్ తో అనుసంధానమై రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేయడానికి స్వర్ణాంధ్ర సాధనకు కలసి పనిచేద్దాం ఇక విశాఖపట్నం ఏఐ పట్నం గా తయారవుతుంది. గూగుల్ హబ్ గా, నాలెడ్జి ఎకానమీగా, పరిశ్రమలు, వ్యవసాయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్రస్ గా మారుతుంది, అని సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.