మొక్క‌లు నాటి సంర‌క్షించాలి


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పచ్చదనం – పరిశుభ్రతలో భాగంగా బుధ‌వారం కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయం మచిలీపట్నంలో
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక, జిల్లా పరిషత్ ముఖ్య కార్యాలయ నిర్వహణ అధికారి డా.జె. అరుణ కార్యాలయ ఆవరణలో మామిడి, కొబ్బరి మొక్క‌లు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనాధికారులు, ఉపముఖ్య కార్య నిర్వహణ అధికారి డా. ఆర్.సి.ఆనంద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను దత్తు తీసుకొని సంరక్షించాలని చైర్ పర్సన్ కోరారు. జిల్లా పరిషత్ ప్రాంగణం పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని తెలిపారు.