Plane Crash | “మిరాకిల్స్ సర్వైవర్స్” జాబితాలో విశ్వాస్ !

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఉన్న 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించగా, కేవలం విశ్వాస్ కుమార్ రమేష్ (41) ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు.

బ్రిటన్ పౌరసత్వం కలిగిన విశ్వాస్‌ 11A సీటులో ప్రయాణించారు. ప్రమాదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయనను కలుసుకుని ధైర్యం చెప్పారు.

ఇలాంటివి ప్రపంచంలో కొన్నే… కానీ మర్చిపోలేని సంఘటనలు

విశ్వాస్‌ మాదిరిగా, గతంలో కూడా కొన్ని విమాన ప్రమాదాల్లో కొందరు అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.

🟢 జులియానే కోయెప్‌కె (పెరూ-జర్మనీ)

1971లో పెరూ పిడుగు పాటు కార‌ణంగా అమెజాన్ అడవిలో విమానం కూలింది. అందులో ప్రయాణించిన 17 ఏళ్ల జులియానే, సీటుతో సహా కింద పడిపోయింది. దాదాపు 10,000 అడుగుల ఎత్తునుంచి ప‌డిన జులియానే… అడవిలో 11 రోజులు ఒంటరిగా బ్రతికి బయటపడింది.

🟢 వెస్నా వులోవిక్ (సెర్బియా)

1972లో యుగోస్లావియా విమానం 33,000 అడుగుల ఎత్తు నుంచి పేలుడు వల్ల కూలింది. అందులో ఉన్న 22 ఏళ్ల వెస్నా వులోవిక్ (విమాన సిబ్బంది) ఒక్కరే బ్రతికారు. ప్యారషూట్ లేకుండానే పడిపోయినా… ప్రాణాలతో బయటపడిన ఆమెకి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా లభించింది.

🟢 బహియా బకారి (ఫ్రాన్స్)

2009లో, 12 ఏళ్ల బహియా తన తల్లితో కలిసి ప్రయాణిస్తుండగా… విమానం ఇండియన్ ఓషన్‌లో పడిపోయింది. స్విమ్మింగ్ రాని చిన్నారి అయినా, ఓ విమాన భాగాన్ని పట్టుకుని 9 గంటల పాటు నీటిలో తేలుతూ బతికింది.

🟢 లరిసా సావిట్స్కయా (రష్యా)

1981లో లరిసా 20 ఏళ్ల వయసులో తన భర్తతో కలిసి విమాన ప్రయాణంలో ఉండగా, దేశీయ ప్రయాణీకుల విమానం మిడ్-ఎయిర్‌లో మిలటరీ విమానంతో ఢీకొని కూలింది.

1981లో, లారిసా 20 ఏళ్ల వయసులో ఆమె భర్తతో కలిసి విమానంలో ప్రయాణిస్తుండగా, ఆ విమానం గాలిలో సైనిక విమానాన్ని ఢీకొట్టి కూలిపోయింది. రెండు విమానాల్లోని 37 మంది మరణించగా.. లారిసా చిన్న విమాన భాగం మీద పడి మృదువైన మట్టిలో పడిపోయింది. మూడు రోజులు అడవిలో ఉండి చివరికి బయటపడింది.

🟢 అన్నెట్ హర్ఫ్కెన్స్ (నెదర్లాండ్స్)

1992లో వియత్నాంలో పర్వతాల్లో విమానం కూలింది. 24 మంది మరణించగా, అన్నెట్ ఒక్కరే బ్రతికారు. ఆమె 8 రోజులు అడవిలో తాగడానికి వర్షం నీటిని స్పాంజ్‌లతో సేకరించి తాగుతూ బతికింది.

ఈ ప్రమాదాల‌ నుంచి ప్రాణాలతో బయటపడటం సాధారణ విషయం కాదు. అయితే, అలాంటి ప్రమాదాల నుంచి బయటపడిన వారి జాబితాలో విశ్వాస్ కుమార్ రమేష్ చేరి “మిరాకిల్ సర్వైవర్”గా గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *