పోలీసుల విచారణకు హాజరు
మాచర్ల, ఆంధ్రప్రభ : పిన్నెల్లి సోదరులు మాచర్లలో అడుగు పెట్టిన నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వెల్దుర్తిలో నాలుగు మాసాల కిందట జరిగిన ఓ హత్యకోసం విచారణ నిమిత్తం పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తమ లాయర్‌తో కలిసి శనివారం పిన్నెల్లి బ్రదర్స్ మాచర్లకు వచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎవరైనా దాడులు చేస్తారేమో అని వైసీపీ కార్యకర్తలు పల్లెల నుంచి పెద్ద ఎత్తున మాచర్లకు చేరుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బలగాలు కూడా మోహరించాయి. మధ్యాహ్న సమయం అయినా విచారణ పూర్తి కాలేదు.