Friday, November 22, 2024

Kangana Ranaut: క్వీన్ కు పెళ్లంట‌…

కంగన రనౌత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? రెడ్డిట్‌లో నిరంత‌ర చ‌ర్చ ఇది. క్వీన్ తనకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని తరచూ చెబుతూనే ఉంది. తనకంటూ ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. పెళ్లి అనే సంస్థపై తనకు నమ్మకం ఉందని కంగనా చెప్పింది. 2024లో రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందా, మీరా చోప్రా వివాహాలు జ‌రిగాయి.

కంగనా రనౌత్ కూడా ఇత‌ర భామ‌ల్లానే నిజంగా రహస్య పద్ధతిలో వివాహం చేసుకుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని రోజుల క్రితం క్వీన్ శాంతాక్రూజ్‌లోని సెలూన్ వెలుపల ఒక వ్యక్తి చేయి పట్టుకుని కార్ వ‌ద్ద‌కు వెళుతూ కనిపించింది. ఆమె జీవితంలో ప్రత్యేక వ్య‌క్తి ఎవరైనా దొరికారా? అని మీడియా ఆశ్చర్యం వ్య‌క్తం చేసింది. ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త నిశాంత్ పిట్టిని కంగ‌న‌ పెళ్లి చేసుకుంది అంటూ ఊహాగానాలు సాగాయి.

ఇప్పుడు మళ్లీ కంగనా రనౌత్ పెళ్లిపై రూమర్లు వస్తున్నాయి. ఇప్పుడు కంగనా రనౌత్ తన పెళ్లి దుస్తుల‌ను డిజైన్ చేయిస్తోంద‌ని రెడ్డిట్‌లో ఒక క‌థ‌నం వెలువ‌డింది. ఇది లెహంగానా లేక డిజైన‌ర్ శారీనా? అన్న‌ది ఇప్ప‌టికి తెలీదు. కానీ దీనికోసం పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్లు ప‌ని చేస్తున్నారని తెలిసింది. ఫ్యాషన్ రంగంలో అగ్ర శ్రేణి డిజైన‌ర్ సోదరుల నుంచి ఈ విష‌యం లీకైంది. ఒక ఇంట‌ర్వ్యూలో డిజైనర్ అనుకోకుండా వార్తలను లీక్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement