ఉప్పెనలా టాలీవుడ్‌కు దూసుకొచ్చిన నటి కృతి శెట్టి. తొలి సినిమా తర్వాత అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ బ్యూటీకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మళ్లి ఇప్పుడు బిజీ అయింది. మరోవైపు సోషల్ మీడియా పుణ్యమాని వర్ధమైన తారలపై విమర్శలు వస్తుంటాయి. వాళ్లు ఏదిచేసినా సరే కామెంట్ చేయడం కొందరికి పరిపాటి. వీటిని అందరూ ఎదుర్కోవాల్సిందే. కొన్ని విమర్శలు బాధపెడతాయి. కొందరు వాటిని సీరియస్‌గా తీసుకోరు. అయితే తనను బాధ పెట్టి విమర్శలున్నాయని కృతిశెట్టి ఓ ఇంటర్యూలో చెప్పింది.
ఇంకా తను మాట్లాడుతూ ప్రతి సినిమాకు కొంత నేర్చుకుంటాం. సహ నటుల ద్వారా కొంత తెలుసుకుంటాం. అయితే కొన్ని సార్లు నాతో పాటుగా నా కో స్టార్స్‌కు విమర్శలపాలయ్యారు అని కృతి చెప్పుకొచ్చింది. ఇక్కడ ఎవరు కూడా పర్‌ఫెక్ట్ కాదు. ప్రతి విషయాన్ని నెగిటివ్‌గా చూడడం సరికాదు. వాటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొత్తగా ఉంటుందని ప్రయత్నిస్తుంటారు.
దీనిపై ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువగా వస్తాయి. ఇవి మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. నేను నా పనిలో మంచి రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. అని చెప్పింది. పరిశ్రమకు రాకముందు కామెంట్ చేయడం చాలా ఈజీ అనిపించేది. కానీ ఇక్కడి వచ్చాక ఇక్కడ ప్రాసెస్ ఎంతో కష్టమో తెలిశాక కామెంట్ చేయడం సరికాదనిపిస్తుంది. నటులను విమర్శించడం సులువే. అయితే వాళ్లు కూడా మనుషులే,వారికి మనసుంటుందనే విషయాన్ని గుర్తించాలి. అదే నేను కోరుకుంటున్నా అని కృతి శెట్టి పేర్కొంది.