Sunday, November 3, 2024

AP : పిఠాపురంలో జ‌న‌సేనాని…ప‌వ‌న్ కు ఘ‌న స్వాగ‌తం..

- Advertisement -

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రో్జుల ప‌ర్య‌ట‌న‌కు పిఠాపురం చేరుకున్నారు.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గొల్లప్రోలు దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగారు. హెలిప్యాడ్ వద్ద జనసేన, టిడిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయ‌న‌కు సాదర స్వాగతం పలికారు. శ్రీపాద గయ శ్రీపాద వల్లభ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సకల విజయం సిద్దిరస్తు అంటూ వేద ఆశీర్వచనాలు అందించారు.

అక్కడి నుంచి దొంతమూరులోని టీడీపీ పిఠాపురం ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి బయలుదేరివెళ్లారు.. ఆయ‌న‌తో గంట‌పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు ప‌వ‌న్. అనంత‌రం ఆక్క‌డే లంచ్ చేశారు.అక్క‌డి నుంచి బ‌య‌లు దేరి పాద గ‌య పుణ్యక్షేత్రానికి వెళ్లారు..అక్క‌డ త‌న ప్ర‌చార ర‌థం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించారు.. పూజల అనంతరం శ్రీపాద, శ్రీ వల్లభ దత్తాత్రేయుడిని పవన్ దర్శించుకున్నారు.

కాగా, హెలిప్యాడ్ వద్ద పవన్ కి స్వాగతం పలికినవారిలో జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు, కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, తోట సుధీర్, మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ తుమ్మల రామస్వామి, దాసరి కిరణ్, టీడీపీ నేతలు గిరీష్ వర్మ, నగేష్ తదితరులు ఉన్నారు.

వారాహి యాత్ర ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ..

రేపు ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పార్టీ చేరికలు పర్యవేక్షించి, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ రెండో తేదిన పిఠాపురంలో జ‌రిగే వివిధ కార్య‌క్రమాల‌లో పాల్గొంటారు.. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి. గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement