‘బేబి’ సినిమాతో హీరోయిన్ గా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య గురించి చెప్పాల్సిన పనిలేదు. యువతలో మంచి క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి సక్సెస్ అయిన నటి. తొలి సినిమాతోనే వంద కోట్లు వసూళ్లు సాధించిన చిత్రంలో భాగమైంది. ఈ సినిమాతో అమ్మడు లక్కీ గాళ్ల్ గానూ గుర్తింపు దక్కించుకుంది.
ఆ విజయంతో ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది. దిల్ రాజు బ్యానర్ లోనే ఛాన్స్ అందుకుంది. ఇంకా అమ్మడి కోసం గీతా ఆర్స్ట్ లాంటి అగ్ర సంస్థల్లోనూ అవకాశాలు అందుకోవడానికి రెడీ గా ఉంది బ్యాకెండ్ లో బన్నీ ప్రోత్సాహం కూడా ఉంది. వైష్ణవి సక్సెస్ అవ్వడంతో మరింత మంది తెలుగు అమ్మాయిల్లో స్పూర్తిని నింపింది. పరిశ్రమ నుంచి ప్రోత్సాహం కూడా బాగానే లభిస్తోంది. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో గతాన్ని తలుచుకుని కుర్రాళ్ల హృదయాల్ని పిండేసినంత పనిచేసింది.
ఒకప్పుడు నేను .. మా అమ్మ సినిమా నటుల్ని చూడాలి అనే కోరికతో ఆడియో ఫంక్షన్స్ కి కలిసి వచ్చేవాళ్లం. నటీనటులతో ఫోటోలు దిగుదామని వెయిట్ చేసే వాళ్లం. కానీ రెండో సినిమాకే నేను ఆడియో ఫంక్షన్ స్టేజ్ పై ఉన్నాను. నిజంగా ఇది చాలా గొప్ప విషయంలా అనిపిస్తోంది. సినిమా వాళ్లది వేరే లోకం . ఆ లోకం ఉండేది అందరి లాంటి వాళ్లేనా అనిపించేది. అక్కడికి వెళ్లడం నాలాంటి వారి వలన కాదని అనుకుంటూ ఉండేదానిని. ఆ కల నెర వేర్చుకోలేకపోతున్నాననే బాధ లోపల ఎంతో ఉండేది.
ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేనిది. కానీ ఈ రోజున నేను పెద్ద పెద్ద వాళ్లతో కలిసి ఈ ఫంక్షన్ లో ఉన్నాను. వాళ్ల పక్కన కూర్చోగల్గుతున్నాను. జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో నాకే అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఇదంతా నిజమేనా? కలనా? అనిపిస్తుంది. జీవితంలో ఊహించనది జరిగితే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ లో ఉన్నాను. నిజంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కీరవాణిగారు నాతో ఓ పాట పాడించడం ఎప్పటికీ మరిచిపోలేను అని అంది. వైష్ణవి సినిమాలకంటే ముందుగా యూ ట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ మంచి ఫాలోయింగ్ దక్కడంతో ఆ క్రేజ్ సినిమాల వరకూ తీసుకొచ్చింది.