సోఫీ చౌదరి గురించి పరిచయం అక్కర్లేదు. మోడల్‌గా, హోస్ట్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిని ప్రదర్శించిన ఈ ఎన్నారై గర్ల్, ఇటీవల బాలీవుడ్‌లో నటిగా కెరీర్ పరంగా వెనకబడింది. ఇంతకుముందు మహేష్ 1 నేనొక్కడినే లో లండన్ బాబులు.. అంటూ సాగే ప్రత్యేక గీతంతో అలరించిన సోఫీ, సినిమా ఫ్లాపవ్వడంతో సౌత్ లో అంతగా మెరవలేదు. బాలీవుడ్ లోనూ కెరీర్ అంతంత మాత్రమే.
మరోవైపు, సోషల్ మీడియాలో తన టెంప్టింగ్ ఫోటోషూట్‌లతో హీటెక్కిస్తూ.. నిరంతరం చర్చల్లో నిలుస్తోంది. తాజాగా సోఫీ మరో స్టన్నింగ్ ఫోటో షూట్ తో కుర్రాళ్ల మతులు కొల్లగొట్టింది.
ఈ ఫోటోషూట్ ఇన్ స్టాలో వైరల్ గా మారుతోంది. సోఫీ డిజైనర్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోసిన తీరు యువతరంలో చర్చగా మారింది. వైట్ అండ్ వైట్ డిజైనర్ ఫ్రాక్ పై నలుపు, ఎరుపు రంగు డిజైనర్ బొమ్మలు ఆకట్టుకోగా, సోఫీ మెడలో ధరించిన గోల్డ్ కలర్ చైన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సముద్ర తీరంలో సోఫీ గుబులు పుట్టించే ఫోజులతో హార్ట్ లో దడ పుట్టించింది. సోఫీ అందచందాలు మతులు చెడగొడుతున్నాయంటూ యూత్ రెచ్చిపోతున్నారు.