తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది తెలుగు హీరోయిన్లు ఉన్నా శోభిత మాత్రం టాలీవుడ్‌ని దాటి బాలీవుడ్‌కి దూసుకెళ్లిన నటి. ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ నార్త్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తుంది.
తాజాగా శోభిత న్యూడిజైన్ లో ఇన్ స్టాకి ఎక్కేసింది. ఇదిగో ఇక్కడిలా షోల్డర్ లెస్ డిజైనర్ ఔట్ ఫిట్ లో శోభిత తన్మయం చెందిస్తుంది. కుర్చీలో శోభిత.. ఆ ముందు టీపాయిలా కనిపిస్తున్న కర్టెన్ లాంటి డిజైన్ లో తళుకులీనింది. టాప్ లో బ్లాక్ పీస్ ధరించి అంతే మత్తెక్కించే పని పెట్టుకుంది. బాటమ్ డిజైన్ సంథింగ్ స్పెషల్ ఉండేలా చూసు కుంది. కుర్చున్న చైర్ కి మ్యాచ్ అయ్యేలా ఇలా స్టైలిష్ డిజైన్ లో మలిచారు.