నేరేడు పళ్లు.. అంటూ ఒక ప్రముఖ సినీకవి శ్రీయ అందమైన కళ్లను చూసి పాట రాసాడు. ఆ పాట ఆ ఆల్బమ్ కే హైలైట్ గా నిలిచింది. వెంకటేష్ ‘సుభాష్ చంద్రబోస్’ చిత్రంలో నేరేడు కళ్లతో శ్రీయ ఎంతగా కవ్వించిందో అభిమానులు మరువలేనిది. ఇకపోతే తన భర్తతో కలిసి పబ్లిక్ వేదికలపై ఎలాంటి భేషజం లేకుండా సరసమాడే శ్రీయ తనలోని బోల్డ్ యాంగిల్ ని ఎప్పటికీ విడిచిపెట్టడం లేదు.
ఇప్పుడు అందమైన చీరలో అంతే అందంగా నేరుడు కళ్లను తిప్పుతూ ఫోటోల కోసం ఫోజులిచ్చింది. పింక్ ఛమ్కీల బ్లౌజు, దానికి కాంబినేషన్ గా లైట్ పింక్ శారీని ధరించిన శ్రీయ క్రీగంటి చూపులతో గుచ్చేస్తోంది. డిజైనర్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ నేరేడు కళ్లతో సూటిగా చూస్తూ చంపేస్తోంది. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ వెబ్ లో వైరల్ గా దూసుకుపోతోంది.