మోడల్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన మరాఠా బ్యూటీ సీరత్ కపూర్.. శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమా సక్సెస్ అయినా.. కథానాయికగా సీరత్ కు పెద్దగా బ్రేక్ లభించలేదు.
ఆ తర్వాత తెలుగులో ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చెసి చూడు’, కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా ఐంత గాథ వినుమా’ వంటి చిత్రాలతో పలకరించింది. అలాగే బాలీవుడ్‌లో జిద్, మారిచ్ సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన ప్రయోజనం దక్కలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సీరత్ కపూర్.