Tuesday, January 7, 2025

Shanvi Srivastava | పింక్ డ్రెస్‌లో శాన్వీ అదుర్స్ !

శాన్వి శ్రీవాస్తవ ప్రధానంగా కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలలో పాపుల‌ర్ న‌టి. 2014 హర్రర్-కామెడీ చిత్రం ‘చంద్రలేఖ’తో కన్నడ చిత్ర పరిశ్రమలో తన న‌ట‌నా వృత్తిని ప్రారంభించింది. ఈ సినిమాలో శాన్వి దెయ్యం పట్టిన యువతి పాత్రలో నటించింది. మరుసటి సంవత్సరం శాన్వి తన ప్రతిభకు గుర్తింపు పొందడంతో పొరుగు భాష‌ల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి.

2015లో ఆమెకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ లభించింది. మంజు మాండవ్య దర్శకత్వం వహించిన ‘మాస్టర్ పీస్’ చిత్రంలో ఆమె పాత్రకు కన్నడ – ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. తారక్ చిత్రంలో ప్రతిభ గల నటిగా పేరు తెచ్చుకుంది.

శాన్వి కన్నడ ఫిలింఫేర్ ఉత్తమ నటిగా నామినేట్ అయింది. కన్నడ ప‌రిశ్ర‌మ నుంచి ఉత్తమ నటిగా సీమ అవార్డును గెలుచుకుంది. శాన్వి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంత‌రం వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఇన్‌స్టాలో తన ఫ్యాషన్ సెన్స్, లుక్‌లతో అభిమానులను ఎగ్జ‌యిట్ చేస్తోంది. అలాంటి ఒక ఫోటోలో షాన్వి అందమైన పింక్ డ్రెస్‌లో క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement