Friday, November 22, 2024

Ragini Dwivedi : బ్లాక్ డెనిమ్ లో రాగిణి…

రాగిణి ద్వివేది ‘ఫెమినా మిస్ ఇండియా’ ర్యాంప్ నుండి కన్నడ చిత్ర పరిశ్రమలో ప్ర‌వేశించిన బ్యూటీ. మిరుమిట్లు గొలిపే లైట్నింగ్ కాంతుల న‌డుమ మోడ‌ల్ గా రాణించి, అటుపై న‌టిగా కెరీర్ ని ప్రారంభించింది. ఈ ప్రయాణం త‌న‌ ప్రతిభకు, పట్టుదలకు, అభిరుచికి నిదర్శనం. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, లాక్మే ఫ్యాషన్ వీక్, శ్రీలంక ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ల‌లో షైన్ అయిన రాగిణి వేగంగా ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది.

- Advertisement -

రోహిత్ బాల్, తరుణ్ తహిలియాని, సభ్య‌సాచి ముఖర్జీ వంటి ప్రఖ్యాత డిజైనర్లతో త‌న‌ అనుబంధం స్టైల్ ఐకాన్ హోదాను మరింత పటిష్టం చేసింది. న‌టిగా విల‌క్ష‌ణ‌త గ్లామ‌ర్ కోణం రాగిణిని స్టార్‌డమ్ దిశ‌గా న‌డిపించాయి. ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని విజయం సాధించిన తర్వాత, మిస్ బ్యూటిఫుల్ హెయిర్ బిరుదును పొందింది.


తాజాగా పాపుల‌ర్ క‌న్న‌డ‌ మ్యాగజైన్ ‘చిత్రసంతే’ మ్యాగజైన్ 125వ ప్రత్యేక కవర్ షూట్ పై మెరిసింది. ఏస్ ఫోటోగ్రాఫర్ కిర‌ణ్ వెంకటరమణప్ప ఈ ఫోటోషూట్ సూత్ర‌ధారి అని రాగిణి తెలిపారు. బ్లాక్ క‌ల‌ర్ డెనిమ్ నిక్క‌రు ధ‌రించిన రాగిణి .. కాంబినేష‌న్ స్కార్ప్ టాప్ లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. రాగిణి డేర్ డెవిల్ బోల్డ్ ఫోటోషూట్ల‌కు మారుపేరు. అలాంటి మ‌రో హాట్ ఫోటోషూట్ ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement