Thursday, January 23, 2025

Pragya Jaiswal | అగ్గి రాజేసేలా అఖండ బ్యూటీ !

పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్‌ ఆశించిన స్థాయి స్టార్‌డం దక్కించుకోలేక పోయింది. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా కంచె సినిమాతోనే ఎక్కువ మంది ఈ అమ్మడిని గుర్తు పట్టడం మొదలు పెట్టారు. వరుణ్‌ తేజ్‌కి జోడీగా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తన అందంతో ఆకట్టుకుంది.

ఇక బాలయ్య మూవీలు అఖండ‌, డాకూ మ‌హారాజ్ మూవీల‌తో అంద‌రికి ద‌గ్గ‌రైంది.. అలాగే సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా హీరోయిన్‌గా కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారానే పాపులారిటీని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.

ఇన్‌స్టాలో ఈ అమ్మడికి దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. తన సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ కోసం రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేసే ప్రగ్యా జైస్వాల్‌ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.

ఈసారి నడుము అందం చూపిస్తూ క్లీవేజ్ షో చేసిన ముద్దుగుమ్మ అంతకు మించి అన్నట్లుగా తన అందంతో ఆకట్టుకుంది. ప్రతిసారి సింప్లీ సూపర్‌ అనిపించే విధంగా ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చే ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తన అందంతో అలరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement