Sunday, November 17, 2024

Polling : ప్ర‌శాంతంగా మూడో ద‌శ పోలింగ్

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో భాగంగా మూడో ధ‌శ పోలింగ్ నేటి ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది.. ఈ ద‌శ‌లో మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు నేటి సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కూ పోలింగ్ కొన‌సాగ‌నుంది.

అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), దాద్రా నగర్ హవేలీ & డామన్ డయ్యూ (2), గోవా (2), గుజరాత్ (25) ), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్ (8), ఉత్తరప్రదేశ్ (10) పశ్చిమ బెంగాల్ (4) లో ఇప్ప‌టి వ‌ర‌కూ పోలింగ్ ప్ర‌శాంతంగా కొనసాగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. ఉద‌యాన్ని ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు ఓట‌ర్ల చేరుకున్నారు..

ఈ 93 స్థానాల‌లో 120 మంది మహిళలు సహా 1300 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.85 లక్షల పోలింగ్ స్టేషన్లలో మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాస్త‌వానికి ఈ మూడో ద‌శ‌లో 95 లోక్ స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. గుజ‌రాత్ లోని సూర‌త్ స్థానం నుంచి బిజెపి అభ్య‌ర్ధి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు..ఇక జ‌మ్మూ క‌శ్మీర్ లో భారీ వ‌ర్షాలు,హిమ‌పాతంలో అనంత్‌నాగ్-రాజౌరీ స్థానంలో పోలింగ్ ను అయిదు ద‌శ‌కు మార్చారు.

బ‌రిలో అమిత్ షా, శివ‌రాజ్ సింగ్

నేటి ఎన్నికల పోరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే తదితర ప్రముఖ నేతలు నేడు త‌మ అదృష్టాన్ని ప‌రిక్షించుకుంటున్నారు.

ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ధాని

నేటి ఉద‌యం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో త‌న ఓటు హ‌క్క‌ను వినియోగించుకున్నారు.. నగరంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో లైన్ లో నిల‌బ‌డి ప్రధాని ఓటేశారు.

అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా, కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జైషా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సీఎం అందరితోపాటు లైన్లో నిల్చోగా గత ఏడాది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన కుమారుడు అనుజ్‌ పటేల్‌ వీల్‌ఛెయిర్‌లో వచ్చి ఓటేశారు.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా విదిశ అభ్యర్థి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కుటుంబం ఓటింగ్‌లో పాల్గొంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన రితేశ్ దేశ్‌ముఖ్‌, ఆయన భార్య జెనీలియా, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరజ్‌ దేశ్‌ముఖ్‌..లాతూర్‌లో ఓటేశారు.


కేంద్రమంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, జామ్‌నగర్ భాజపా ఎమ్మెల్యే రివాబా జడేజా, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ బారామతి అభ్యర్థి సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబం, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబం, కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement