Monday, September 16, 2024

Pawan Kalyan: మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ మార్ష‌ల్ ఆర్డ్స్ ..

ఏపీ ఎన్నికల కారణంగా పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు కొన్నాళ్లుగా పక్కన పెట్టారు. పవన్ డేట్స్ కోసం ఆ మూడు సినిమా యూనిట్స్ ఎదురుచూస్తున్నాయి. అయితే వీటిలో OG సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని డేట్ కూడా చెప్పేసారు కాబట్టి OG సినిమానే ముందు వస్తుంది. ఇంకా 20 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే OG షూటింగ్ అయిపోతుంది. ఇప్పటికే OG సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు OG సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో సుజీత్ పాల్గొని OG సినిమా గురించి కూడా పలు విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో OG సినిమాలోని ఓ సీన్ గురించి తెలిపి పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని తెలిపాడు.

సుజీత్ మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఐకిడో ఫైట్ OG సినిమాలో ఉంది. దాని గురించి చాలానే రీసెర్చ్ చేసాము. ఆ సీన్ గురించి చెప్పాక పవన్ కళ్యాణ్ ఇంకా ఎగ్జైట్ అయి తన బెస్ట్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేశారు. అలాగే ఐకిడో కి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా చూసారు. దాని గురించి నాతో మరింత చర్చించి సీన్ ని చాలా బాగా వచ్చేలా కష్టపడ్డారు. హాఫ్ డేలో అయిపోవాల్సిన ఆ సీన్ ని పవన్ ఇంకా పర్ఫెక్ట్ గా తేవాలని మూడు రోజులు షూట్ అయింది. కళ్యాణ్ కి ఏదైనా ఇంట్రెస్ట్ గా అనిపిస్తే అంత తొందరగా వదలరు అని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement