Home ఫోటో గ్యాలరీ Nidhhi Agerwal | అందాల నిధి….

Nidhhi Agerwal | అందాల నిధి….

0

నాగ చైతన్యతో కలిసి సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ రామ్‌ కి జోడీగా నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్‌లో నిధి అగర్వాల్‌ బిజీ అయ్యింది.

తెలుగుతో పాటు తమిళ్‌లోనూ నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోయినా తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా హరి హర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో ఈ అమ్మడు రాజకుమారి పాత్రలో కనిపించబోతుంది. ఆ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

సినిమాలతో కాస్త తక్కువ కనిపించినా సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ కనిపిస్తూ ఉంది. అందంతో ఆకట్టుకోవడంతో పాటు తనకు ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లోనూ రాణిస్తూ వస్తోంది.

ఏ ఔట్‌ ఫిట్‌ ధరించినా భలే అందంగా కనిపించే నిధి అగర్వాల్‌ తాజాగా సాంప్రదాయబద్దమైన చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేసింది. అందమైన పట్టు చీర కట్టులో నిధి అగర్వాల్‌ ఆకట్టుకుంది అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version