Sunday, December 29, 2024

Mehreen Pirzada | పార్టీ వేర్ లో మైమ‌రిపిస్తున్న‌ మెహ్రీన్ !

”కృష్ణగాడి వీర ప్రేమగాథ” సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. “మహానుభావుడు”, “రాజా ది గ్రేట్, “F2”, “F3” వంటి సూపర్ హిట్ సినిమాలు మెహ్రీన్ ఖాతాలో ఉన్నాయి.

అందం, అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు. అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ భామ బ్యాంకాక్‌లో పర్యటిస్తోంది.

అక్కడ పలు పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా, తన లేటెస్ట్ పార్టీ వేర్ లుక్‌లో త‌లుక్కుమ‌న్న మెహ్రీన్ పిర్జాదా ఆ ఫోటోల‌ను షేర్ చేసింది. మెహ్రీన్ తాజాగా ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement