మిస్ వరల్డ్ 2017 విజేతగా, మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మానుషి చిల్లర్, తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు.పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ తన గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.
హరియాణాకు చెందిన ఈ అందగత్తె 17 సంవత్సరాల తర్వాత భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ లో 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మానుషి, మొదటి సినిమాతోనే భారీ ఫ్లాప్ ఎదుర్కొంది. అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తరువాత, “ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ” లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా, ఈ చిత్రమూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో వచ్చినా, అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. ఇక అమ్మడు సక్సెస్ ఫెయిల్యూర్ తో సంభంధం లేకుండా ముందుకు కొనసాగుతోంది. ఇక గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.
రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో స్టైలిష్ ఫొటోలతో ఎట్రాక్ట్ చేసింది. ఓ వైపు గ్లామర్ డోస్ మరోవైపు ట్రెడిషన్ లుక్కులో సూపర్బ్ అనేలా దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతూ, మాజీ మిస్ వరల్డ్ కు మొదటి హిట్ ఎప్పుడు దక్కుతుందోనని అభిమానులు చర్చిస్తున్నారు. సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, నెక్స్ట్ మూవీతో సక్సెస్ సాధించాలని ఆమెకు సూచనలు వస్తున్నాయి.