కీర్తి సురేష్ అలియాస్ మహానటి ఛేంజోవర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మడికట్టుకుని కూర్చుంటే పనవ్వదని ఆలస్యంగా గ్రహించినా కొత్త కమిట్ మెంట్లతో ఆ గ్యాప్ ని వీలైనంత త్వరగా పుల్ ఫిల్ చేసే పనిలో పడింది. కొత్తగా ఏ సినిమాలు కమిట్ అయినా! అన్నింటికి సై అంటూ ముందుకెళ్లిపోతుంది.
‘సర్కారు వారి పాట’తో ఆ సంగతి అందరికీ అర్దమైంది. ఇదే సమయంలో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడకి తగ్గట్టు అమ్మడు మౌల్డ్ అవుతుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి ‘బేబి జాన్’ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి – వరుణ్ తో ఇంటిమేట్ సన్నివేశాలు..పెదవి ముద్దుల్లోనూ చెలరేగుతుందని సమాచారం.
ఘాడమైన లిప్ లాక్ దర్శకుడు తప్పనిసరిగా భావించడంతో ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఎస్ చెప్పిందని బాలీవుడ్ లో మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ సన్నివేశాలు ఎంతో రియలిస్టిక్ గా ఉంటాయని…సినిమాలో హైలైట్ గాను నిలుస్తాయని సమాచారం.
ఇప్పటివరకూ ఈ తరహా అటెంప్ట్ లు కీర్తి చేయలేదు. తెలుగు లో స్కిన్ షో చేసింది తప్ప! ముద్దులు..ముచ్చటకు దూరంగానే ఉంది. కానీ బాలీవుడ్ లో అలా ఉంటానంటే పనవ్వదు కాబట్టి విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది.
ఇక స్ర్కీన్ పై తొలి ముద్దును వరణ్ ధావన్ కు ఇచ్చింది కీర్తి.