సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆరంగేట్రమే కుర్రకారు హార్ట్ బీట్‌ని టచ్ చేసిన కేతిక శర్మ పూరి తనయుడు ఆకాష్ సరసన ‘రొమాంటిక్’ చిత్రంలో నటించింది. డెబ్యూ నటిగా హృదయాల్లో తిష్ట వేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది. అయితే డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పే కేతిక ‘దిల్ తో పాగల్ హై’ సినిమా చూశాక నటిని కావాలని అనుకుందిట.
తన కలను కూడా నిజం చేసుకుంది. కేతిక సోషల్ మీడియాల్లోను గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తాజాగా కేతిక షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
అందమైన దేహశిరులను కప్పేందుకు రెండు తేలిక పాటి వస్త్రాలను ధరించింది ఈ బ్యూటీ. వంగ పువ్వు రంగు టాప్ ధరించిన కేతిక, బాటమ్ లో థై స్లిట్ డ్రెస్ ని ధరించింది.
ఈ లుక్ లో రొమాంటిగ్గా కనిపిస్తోంది కేతిక. అలా చేతిలో ఒక నవలను పట్టుకున్న కేతిక ఆదమరిచి చదివేస్తుంటే కెమెరా క్లిక్ లు హోరెత్తించాయి. కానీ కేతిక భంగిమలకు కుర్రకారు గుండె లయ తప్పి పోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ వైరల్ గా షేర్ అవుతోంది.