సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి కెరీర్లో ముందుకు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కేవలం అందం కాదు కచ్చితంగా అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు దక్కించుకుని రాణించగలుగుతారు. అలాంటి వారిలో బాలయ్య బ్యూటీ హనీరోజ్ కూడా ఒకరు. 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు.
ఈ క్రమంలోనే ఇప్పటికి తన సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏవో ఒక గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు యాక్టర్ గా కనిపించిన హనీ రోజ్.. త్వరలోనే నిర్మాతగా మారాలని ఫిక్స్ అయిందట. వర్గీస్ ఇస్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా దానిని వెల్లడించింది.
ఇక ఈ అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే.. ఆమెకు తెలుగు హీరో అంటే ఎంతో ఇష్టమట. ఇప్పటికీ ఆమె ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుందట. అర్ధరాత్రి టైంలో ఫోన్ చేసి తెగ విసిగించేస్తుందట. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ పదేపదే చెప్తున్నా.. ఆ హీరో మాత్రం పట్టించుకోలేదని.. దీంతో అమ్మే కాస్త హర్ట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.